జైలు నుంచి వ‌చ్చి ఓటేసిన ఎమ్మెల్యేలు

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 02:04 PM
 

న్యూఢిల్లీ: మ‌నీల్యాండ‌రింగ్ కేసులో జైలు జీవితం అనుభ‌విస్తున్న ఎమ్మెల్యేలు ఛ‌గ‌న్ బుజ్‌బ‌ల్‌, ర‌మేశ్ క‌డ‌మ్‌లు ఇవాళ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటేశారు. ముంబైలో ఉన్న మ‌హారాష్ట్ర అసెంబ్లీ హాల్‌కు వ‌చ్చిన ఇద్ద‌రు బీజేపీ ఎమ్మెల్యేలు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. మాజీ ఎన్సీపీ నేత‌ బుజ్‌బ‌ల్ ప్ర‌స్తుతం ఆర్ద‌ర్ రోడ్ జైలులో శిక్ష అనుభ‌విస్తున్నారు. ప్ర‌త్యేక అంబులెన్స్‌లో ఆయ‌న అసెంబ్లీకి వ‌చ్చి ఓటేశారు. అవినీతి కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ ఎన్సీపీ నేత‌ ర‌మేశ్ క‌డ‌మ్ ప్ర‌స్తుతం బైకుల్లా జైలులో శిక్ష అనుభ‌విస్తున్నారు. త‌న‌కు ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని ఎమ్మెల్యే కొన్ని రోజుల క్రితం ముంబై కోర్టులో అభ్య‌ర్థ‌న పెట్టుకున్నారు. అయితే ఓటు వేసేందుకు ర‌మేశ్‌కు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. కానీ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ర‌మేశ్‌కు ఓటు వేసే అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని వాదించింది.