పాక్ బ‌ల‌గాల కాల్పుల్లో జ‌వాను మృతి

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 01:06 PM
 

శ్రీన‌గ‌ర్‌: పాకిస్థాన్ మ‌రోసారి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జ‌మ్ముక‌శ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో పాక్ బ‌ల‌గాలు జ‌రిపిన కాల్పుల్లో ఓ ఏడేళ్ల బాలిక‌తోపాటు జ‌వాను నాయ‌క్ ముద‌స్స‌ర్ అహ్మ‌ద్‌ కూడా మృతి చెందాడు. మ‌రో ఇద్ద‌రు పౌరులు గాయ‌ప‌డ్డారు. ఇవాళ ఉద‌యం ఏడున్న‌ర గంట‌ల ప్రాంతంలో రాజౌరీలో బంక‌ర్‌పై మోటార్ షెల్స్‌తో పాక్ బ‌ల‌గాలు విరుచుకుప‌డ్డాయి. దీంతో అక్క‌డ గ‌స్తీ కాస్తున్న 37 ఏళ్ల ముద‌స్స‌ర్ అహ్మ‌ద్ అనే జ‌వాను అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. అత‌నికి ఇద్ద‌రు పిల్ల‌ల‌ని ఆర్మీ తెలిపింది. ఈ ఘ‌ట‌న‌పై మిలిట‌రీ ఆప‌రేష‌న్స్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ జ‌న‌ర‌ల్‌ను హెచ్చ‌రించారు. కాల్పుల విర‌మ‌ణ ఒప్పంద ఉల్లంఘ‌న‌ను తిప్పికొడ‌తామ‌ని స్ప‌ష్టంచేశారు.