కర్నూల్ టీడీపీలో విషాదం.. కీలక నేత మృతి

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 05, 2021, 02:18 PM
 

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కోడుమూరు మండలంలో కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా, మైనారిటీ నాయకులుగా ఉన్న టీడీపీ నాయకులు జంఖనం రఫిక్ బాషా శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతి చెందారు.
గత నెల జనవరి 14న కర్నూలు సమీపంలోని పెద్దపాడు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన కర్నూలు గౌరీ గోపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. కాగా ఆయన మృతి పట్ల పలువురు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.