మీరా కుమార్ కు హ్యాండిచ్చిన తృణమూల్

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 01:04 PM
 

ఈ ఉదయం రాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభం కాగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కొందరు తమ అధినేత్రి నిర్ణయాన్ని కాదని, ఎన్డీయేకు చెందిన రామ్ నాథ్ కోవింద్ కు ఓటు వేసినట్టుగా తెలుస్తోంది. ఓ ఎంపీతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు మీరా కుమార్ ను కాదని కోవింద్ కు ఓటు వేసి, ఆ విషయాన్ని బయటకు వచ్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రకటించిన మీరా కుమార్ కు మద్దతు పలికిన మమతా బెనర్జీ, తన పార్టీ ప్రజా ప్రతినిధులంతా ఆమెకే ఓటు వేయాలని చెప్పినా, వీరు వినకపోవడం గమనార్హం. ఈ విషయమై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.