రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటేసిన అమిత్ షా

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 12:53 PM
 

ఢిల్లీ: రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో భాగంగా ఇవాళ పార్ల‌మెంట్‌లో బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ఓటేశారు. గుజ‌రాత్‌లోని న‌ర‌న్‌పుర‌ నుంచి అమిత్ షా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి తీసుకున్న అమిత్ షా ఇవాళ పార్ల‌మెంట్‌లో ఓటేశారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం 14 మంది రాజ్య‌స‌భ‌, 41 మంది లోక్‌స‌భ ఎంపీల‌కు త‌మ‌త‌మ రాష్ట్ర అసెంబ్లీల్లో ఓటు వేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. మొత్తం అయిదు మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో త‌మ ఓటును పార్ల‌మెంట్‌లో వేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. మ‌రో న‌లుగురు ఎమ్మెల్యేలు మ‌రో రాష్ట్రంలో ఓటు వేసుకునే వెస‌లుబాటు క‌ల్పించింది. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల కోసం 32 పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. పార్ల‌మెంట్‌లోని రూమ్‌నెంబ‌ర్ 62తో పాటు 29 రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చ‌రి అసెంబ్లీల్లో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు.