కోదాడ వద్ద ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆది నారాయణరెడ్డి కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆది నారాయణరెడ్డి ఇద్దరు గన్మెన్లు, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వర్షంతో రహదారి కనపడక కాన్వాయ్‌లోని ఒక వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. గన్మెన్లు, డ్రైవర్‌ను మంత్రి తన వాహనంలో కోదాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు.