లాడ్జిలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య..

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 01, 2021, 01:22 PM
 

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ప్రైవేటు లాడ్జ్​లో మహేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపుతోంది. పట్టణంలోని నౌమన్ నగర్​లో నివసించిన మహేశ్వరరెడ్డి సంజీవనగర్​లో ఓ ప్రైవేటు లాడ్జిలోని గదిని ఆదివారం ఉదయం తీసుకున్నాడు. సాయంత్రం గది నుంచి నీరు బయటకు రావటంపై అనుమానంతో... లాడ్జి సిబ్బంది తలుపులు తెరిచి చూశారు. అప్పటికే... మహేశ్వరరెడ్డి ఫ్యానుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహేశ్వర రెడ్డికి భార్య, కూతురు ఉన్నారనీ.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.