ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూయార్క్‌లో షాపింగ్‌ చేస్తోన్న కోహ్లీ ,అనుష్క

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 15, 2017, 04:06 PM

 భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మతో కలిసి న్యూయార్క్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. తాజాగా వీరిద్దరి ఫొటో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. వెస్టిండీస్‌ పర్యటన ముగించుకున్న కోహ్లీ అనుష్క కోసం న్యూయార్క్‌లో వాలిపోయాడు. స్థానిక మెట్‌లైఫ్‌ మైదానంలో ఐఫా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కోసం అనుష్క న్యూయార్క్‌ చేరుకుంది.


త్వరలో కోహ్లీ శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ, వెస్టిండీస్‌ పర్యటనతో బిజీగా గడిపిన కోహ్లీ శ్రీలంక పర్యటనకు కాస్త విరామం దొరకడంతో ఆ సమయాన్ని అనుష్కతో గడిపేందుకు కేటాయించాడు. దీంతో విరుష్క జోడీ న్యూయార్క్‌లో షికార్లు చేస్తోంది. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా హల్‌చల్‌ చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com