పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే చర్యలు

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 12, 2021, 12:19 PM
 

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కోడుమూరు పట్టణంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప ఐపీఎస్, కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు కోడుమూరు ఎస్సై మల్లికార్జున వారి సిబ్బందితో కలిసి కోడుమూరు - కర్నూలు రహదారిలో హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద ఓవర్ లోడ్ తో వెళ్తున్నటువంటి ఆటోలపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రెండు ఆటోలను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై మల్లికార్జున మాట్లాడుతూ కోడుమూరు మండల పరిధిలో ఎవరైనా ఆటో డ్రైవర్లు ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే వారిపైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాటిని సీజ్ చేసిన వాహనాలను ఆర్టీవో కార్యాలయంకు పంపుతామని ఎస్సై తెలిపారు.