ఒడిశాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు బాలికను హత్య చేసి.. ఆ తర్వాత మృతదేహంపై లైంగికదాడి చేసి పైశాచిక ఆనందం పొందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది జులై 13వ తేదీన పోర్న్ వీడియోలు చూసిన ఓ యువకుడు.. తన కోరికలను అదుపులో ఉంచుకోలేకపోయాడు. తన ఇంటికి సమీపంలోని ఓ ఐదేళ్ల బాలికను ఇంట్లోకి తీసుకువచ్చి అత్యాచారం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో.. హత్య చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని స్థానికంగా ఉన్న చెరువులో పడేశాడు. జులై 23వ తేదీన బాలిక మృతదేహం లభ్యమైంది. అయితే మృతురాలి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఒడిశా అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. తన కుమారుడు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదని, తన కుమారుడికి రూ.5 లక్షలు ఇచ్చి నేరం అంగీకరించేలా పోలీసులు అతన్ని ఒప్పించారని ఆరోపించింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 24వ తేదీ వరకు పోలీసులు అతడిని విచారించనున్నారు.