నెరవేరిన చిమ్మిరిబండ వాసుల చిరకాల స్వప్నం

  Written by : Suryaa Desk Updated: Tue, Dec 22, 2020, 08:38 PM
 


చిమ్మిరి బండ వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది.  చిమ్మిరి బండ వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలకు  వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. దీంతో జనజీవనం స్తంభించి పోయేది. ఏళ్ళ తరబడి బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు  తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018 మార్చిలో     బ్రిడ్జి నిర్మాణానికి పిఎంజిఎస్ వై    నిధులు రూ. 3.2 కోట్లు   మంజూరు చేయించారు. 2019లో బ్రిడ్జి నిర్మాణ పనులకు టెండర్లు పూర్తి చేసిన అధికారులు శర వేగంగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేశారు. అనేక ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను ఎమ్మెల్యే ఏలూరి పరిష్కరించారని కొనియాడారు. ఈ సందర్భంగా తాము పడిన కష్టాలను ఆయా గ్రామాల ప్రజలు గుర్తుచేసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం తో చిమ్మిరి బండ, ద్రోణాదుల, నాగండ్ల, ఇడుపులపాడు,ఇంకొల్లు ప్రాంతాల ప్రజలకు రవాణా వ్యవస్థ మెరుగుపడింది. ఎన్ హెచ్ 5 నుంచి ఇంకొల్లు వెళ్లేందుకు బ్రిడ్జి నిర్మాణంఎంతగానో ఉపయోగపడనుంది. బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే ఏలూరి

చిమ్మిరి బండ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అనేక గ్రామాల ప్రజలు  బ్రిడ్జి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. బ్రిడ్జి నిర్మాణం తో అనేక గ్రామాలకు రహదారి  సౌకర్యం లభించిందన్నారు. అతి పొడవైన వాగుపై బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రజలు రోజుల తరబడి బయటకు వచ్చే పరిస్థితి లేదని వరదల సమయంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయన్నారు.  రహదారి సౌకర్యం సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


  • ఎమ్మెల్యే ఏలూరి కృషి తో బ్రిడ్జి నిర్మాణం

  • రూ.3.2 కోట్లతో  నిర్మాణ పనులు  పూర్తి 

  • బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే ఏలూరి