టీమిండియా నయా బౌలర్ నటరాజన్ ను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమిళనాడు నుంచి టీమిండియాకు ఎంపికైన టి.నటరాజన్ ఆసీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. నటరాజన్ ప్రదర్శనపై గురించి ఎంత మాట్లాడినా తక్కువే అన్నారు. షమీ, బుమ్రా లాంటి కీలక బౌలర్లు లేకపోయినా నటరాజన్ 6 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడని ప్రశంసించారు. నటరాజన్ ఇలాగే ఫర్ఫామెన్స్ చేస్తే రానున్న టీ20 ప్రపంచకప్ లో టీమిండియాకు కీలక బౌలర్ అవుతాడన్నారు.
ఇక టీ20 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ హార్దిక్ పాండ్యా కూడా ఈ నటరాజన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆసీస్ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ నటరాజన్ ను ప్రశంసించారు. నటరాజన్ అద్భుతమైన ప్రదర్శనతో తన ఫామ్ ను అలాగే కొనసాగించాలన్నారు. ఇక నటరాజన్ ఫామ్ చూస్తుంటే షమీ స్థానానికి ఎసరు వచ్చేలా ఉందని సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. అలాగే క్రికెట్ దిగ్గజాలు ఇయాన్ బిషప్, టామ్ మూడీ సైతం నటరాజ్ ను అభినందించారు.