ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడు విజయశాంతి.. ఇప్పుడు అనుష్క.. నయనతార

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2017, 11:37 AM

‘ప్రతి జనరేషన్‌లో మేల్‌ హీరో రేంజ్‌లో ఫిమేల్‌ హీరోయిన్‌ కూడా ఉంటుంది. ఒకప్పుడు విజయశాంతి... ఇప్పుడు అనుష్క, నయనతార. హీరోలకు ఏ మాత్రం తీసిపోని క్రేజ్‌ వీరిది. ‘వాసుకి’ ట్రైలర్, పాటలు బాగున్నాయి’’ అన్నారు నిర్మాత కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌. నయనతార లీడ్‌ రోల్‌లో ఎ.కె. సాజన్‌ దర్శకత్వంలో వచ్చిన మలయాళ ‘పుదియనియమం’ సినిమాను నిర్మాత ఎస్‌.ఆర్‌. మోహన్‌ ‘వాసుకి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్, పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘నేనొక లాయర్‌ని. సినిమాలంటే ఉన్న ఆసక్తితో డబ్బులు కూడబెడుతూ వచ్చి, ‘వాసుకి’ హక్కులు కొన్నాను. ఈ నెల 21న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు ఎస్‌.ఆర్‌. మోహన్‌. నిర్మాతలు రాజ్‌కందుకూరి, మల్కాపురం శివకుమార్, టి. రామసత్యనారాయణ, దర్శకుడు రాజ్‌ మాదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సమర్పణ: అర్జున్‌ ఆర్యన్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com