ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండెను తీసుకెళ్తూ.. హాస్పిటల్‌పై కూలిన హెలికాప్టర్,చివరికి.!

international |  Suryaa Desk  | Published : Mon, Nov 09, 2020, 03:40 PM

ఓ రోగి ప్రాణాలు కాపాడేందుకు దాత నుంచి సేకరించిన గుండెను హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్‌కు తరలిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. హాస్పిటల్ భవనం మీద ఉన్న హెలిప్యాడ్ మీద దిగుతున్న హెలికాప్టర్ అకస్మాత్తుగా అదుపు తప్పి కూలిపోయింది. అదృష్టం ఏంటంటే అంతా ప్రాణాలతో బయటపడ్డారు. హెలికాప్టర్ కుప్పకూలిపోయినా తీసుకెళ్తున్న గుండెకు మాత్రం ఏమీ కాలేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆస్పత్రి సిబ్బంది దాన్ని హాస్పిటల్‌లో తీసుకెళ్తున్నప్పుడే.. జరగకూడనిది జరిగిపోయింది. ఆ గుండెను తీసుకెళ్తున్న ఉద్యోగి దేన్నో తన్నుకుని కిందపడ్డాడు. అంతే బాక్సులో ఉన్న గుండె కిందపడింది. ఈ షాకింగ్ ఘటన లాస్‌ ఏంజెల్స్‌లో చోటుచేసుకుంది.
ఓ రోగిని కాపాడేందుకు దాత నుంచి సేకరించిన గుండెను హుటాహుటిన కెక్ హాస్పిటల్‌కు తరలిచేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే, హెలికాప్టర్ హాస్పిటల్ మీద ఉన్న హెలిప్యాడ్ మీదకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మిగతా ఇద్దరు ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో గుండెను ఉంచిన బాక్స్ సురక్షితంగానే ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఆ గుండెను హెలికాప్టర్ నుంచి తీసి వైద్యుడి అందించారు. అయితే వైద్యుడు దాన్ని పట్టుకుని ఒక్కసారే కిందపడ్డాడు. అంతే గుండె కూడా కిందపడిపోయింది. ఈ సారి కూడా ఆ గుండెకు ఏమీ కాలేదు. అది కిందపడినా.. వైద్యులు దాన్ని శుభ్రం చేసి రోగికి సరైన సమయంలో చికిత్స అందించి ఆ గుండెను అమర్చినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా దాత ఇచ్చిన ఆ గుండెకు వరసగా ప్రమాదాలు ఎదురైనా ఏమీ కాకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఆ గుండెను స్వీకరించిన ఆ రోగి చాలా అదృష్టవంతుడు అంటూ స్థానిక మీడియా అంటూంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com