తక్కువ పెట్టుబడితోనే ఏదో ఒక వ్యాపారం చేసి స్వయం ఉపాధి పొందాలని చాలా మంది భావిస్తారు. అలాంటి వారికోసమే Lokal యాప్ ఈరోజు ఒక చక్కటి, తక్కువ పెట్టుబడితో చేయగలిగే స్వయం ఉపాధి మార్గాన్ని తీసుకువచ్చింది. అదే పుట్టగొడుగుల వ్యాపారం. పుట్టగొడుగుల పెంపకం ద్వారా ప్రతి నెలా అదిరిపోయే రాబడి పొందొచ్చు.
ఒక చిన్న రూమ్లో కూడా పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించొచ్చు. దీని కోసం రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఉంటే సరిపోతుంది. పుట్టగొడుగుల పెంపకం కోసం మీరు కంపొసైట్ను ఉపయోగించాలి. దీన్ని మీరే సొంతంగా తయారు చేసుకోవచ్చు. 20 రోజుల నుంచి 25 రోజులకే పుట్టగొడుగులు వస్తాయి.పుట్టగొడుగుల్లో చాలా పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఇష్టపడతారు. మార్కెట్లో కేజీ పుట్టగొడుగుల ధర రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. మీరు మార్కెట్లో నేరుగా లేదంటే ఆన్లైన్లో కూడా పుట్టగొడుగులను విక్రయించొచ్చు.
ఇటువంటి వ్యాపారాలను ప్రారంభించే ముందు తగిన పరిశోధన చేసి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే వ్యాపారాన్ని ప్రారంభించండి.