భర్తకు ప్రాణగండం అంటూ పూజలు..ఆపై తాళికట్టిన జ్యోతిష్యుడు

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 23, 2020, 07:53 PM
 

పూజలు చేయకుంటే భర్తకు ప్రమాదం అంటూ మాయమాటలు చెప్పాడు. పూజలు చేస్తే మీ భర్త బతుకుతాడంటూ నమ్మించాడు. తనను పెళ్లి చేసుకోకపోతే నీ భర్త చనిపోతాడని..నీకు పక్షవాతం వస్తుందని బెదిరించి తాళికట్టేశాడు. ఆ తర్వాత అతడు నిజస్వరూపం బయటపెట్టాడు. అసభ్యకర ఫోటోలు, మెసేజ్ లు పెడుతూ వేధిస్తున్నాడు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడి ఆటకట్టించారు పోలీసులు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.ఓ మహిళ తన భర్త కలిసి జీవిస్తోంది. ఆమెకు కోసూరి మాధవ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తానొక జ్యోతిష్యుడిని అంటూ పరిచయం పెంచుకున్నాడు. జాతక దోషం వల్ల బాధితురాలికి పక్షవాతం..ఆమె భర్తకు ప్రాణగండం ఉందని నమ్మించాడు. పూజలు చేస్తే భర్తకు ప్రాణ గండం తప్పుతుందని చెప్పాడు. భర్త లేని సమయంలో పూజలు చేయాలని చెప్పడంతో ఆమె పూజకు ఏర్పాటు చేసింది. భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి పూజలు చేస్తున్నట్లు నటించి ఆమె మెడలో తాళి కట్టేశాడు. తాళి కట్టినప్పుడు ఫోటోలు సైతం తీశాడు.ఆ తర్వాత అతడి క్రిమినల్ మైండ్ కి పనిచెప్పాడు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని బాధితురాలిని వేధించడం మెుదలు పెట్టాడు. నువ్వే నా భార్యవంటూ ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడేవాడు. అంతేకాదు ఫోన్ కి అసభ్యకర మెసేజ్ లు సైతం పెట్టేవాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కోసూరి మాధవ్, స్నేహితుడు రాఘవ్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.