వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకునే వరకు పోరాడుతాం :సిపిఎం

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 21, 2020, 07:28 PM
 

సిపిఎం పొలిట్ బ్యూరో ఇచ్చిన పిలుపు మేరకు కర్నూల్ నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు ఓల్డ్ సిటీ నాయకులు రామకృష్ణ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, గౌస్ దేశాయ్ మాట్లాడుతూ బలప్రయోగంతో వ్యవసాయ బిల్లుల ఆమోదం వల్ల రైతుల పాలిట మరణశాసనంగా మారుతుందని ఈ బిల్లు అమలు అవుతే చిన్న మధ్య తరగతి రైతులు సర్వనాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రాజ్యసభలో 21 పార్టీలు స్వయానా వారి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు వ్యతిరేకించినప్పటికీ మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించడం అంటే ఇది ఒక చీకటి దినం అని తెలియజేశారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులు మరింత మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కృష్ణ, భాష, నాగేష్, రామకృష్ణ , ఏసు తదితరులు పాల్గొన్నారు.