ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడాలి నాని ని బర్త్ రఫ్ చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 21, 2020, 07:26 PM

హిందూ మతాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి కొడాలి నానిని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యురాలు రెడ్డి డిమాండ్ చేశారు.భాజపా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సోమవారం సాయంత్రం ఆ పార్టీ నాయకులు స్థానిక రాములవారి గుడి సమీపంలో ని ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారికి వినతిపత్రం అందజేశారు.అనంతరం ర్యాలీగా వెస్ట్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని సిఐ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శాంతారెడ్డి మాట్లాడుతూ మంత్రి పదవిలో ఉండి హిందువులను కించపరిచే విధంగా కొడాలి నాని మాట్లాడడం తగదన్నారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని పదవి నుంచి తొలగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.ఎప్పటి నుంచో శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్తులు తప్పనిసరిగా డిక్లరేషన్ పై సంతకం చేయాల్సి ఉందని అయితే ప్రస్తుత చైర్మన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం తగదన్నారు. ముఖ్యమంత్రి కూడా శ్రీవారు బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న తరములలో ప్రజలకు మేలు జరగాలని కోరుకోవాలని అన్నారు.ముఖ్యమంత్రి హిందువులను కించపరిచే విధంగా వివరించిన మంత్రి పై వారి పార్టీ నాయకుల పై చర్యలు తీసుకోకపోతే తిరుపతి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకుని నిరసన తెలియజేస్తారని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com