జిల్లా అధికారులు కేటాయించిన విధులు అప్రమత్తంగా నిర్వహించండి : జేసి

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 21, 2020, 07:06 PM
 

ముఖ్యమంత్రి ఈనెల 23, 24 తిరుమల పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన నిమిత్తం విధులు కేటాయించిన జిల్లా అధికారులు కోవిడ్ పరీక్షలు నిర్వహించుకుని, కేటాయించిన విధులు అప్రమత్తంగా నిర్వహించాలని జేసి మార్కండేయులు అధికారులను ఆదేశించారు.సోమవారం మద్యాహ్నం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. జేసి వివరిస్తూ ప్రధానంగా ముఖ్యమంత్రి పర్యటన సాగే రహదారులపై దృష్టి పెట్టి, మరమ్మత్తులు ఆర్ అండ్ బి అధికారులు చేపట్టాలని, సానిటేషన్ పై జిల్లా పంచాయితీ అధికారి, నగరపాలక సంస్థ అధికారులు చేపట్టాలని సూచించారు.అంబులెన్స్ లు, అధికారులకు కోవిడ్ పరీక్షల నిర్వహణ వంటి ఏర్పాట్లు రుయా, స్విమ్స్, డీ ఎం అండ్ హెచ్ ఓ చూడాలని సూచించారు. ఫైర్ సిబ్బంది ఫైర్ భద్రత పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమీక్షలో డీఆర్ఓ మురలి, డిప్యూటీ కలెక్టర్లు రాజశేఖర్ , ప్రభాకర్ రెడ్డి, రూరల్ తహశీల్దార్ కిరణ్ కుమార్, రేణిగుంట తహశీల్దార్ శివప్రసాద్, రుయా సూపరింటెండెంట్ డా.భారతి, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్ రామ్, డీ ఎం అండ్ హెచ్ ఓ పెంచలయ్య, డీసీహెచ్ఎన్ సరలమ్మ, ఎ ఎస్ ఓ ఝాన్సీలక్ష్మి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.