ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలు మీ ఒంట్లో ఐరన్ ఉందా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 21, 2020, 06:50 PM

మహిళలు ఎక్కువగా తలెత్తే సమస్య రక్త హీనత. శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే రకరకాల సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అసలు చాలమందికి తమలో ఈ సమస్య ఉన్నట్టు గుర్తించలేకపోతున్నారు. రక్తహీనత వల్ల బ్రీతింగ్ సరిగ్గా అందదు. దీంతో తొందరగా నీరసపడిపోతారు. కండరాలు బలహీనం అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికీ మన దేశంలో రక్తహీనత కారణంగా ప్రసవం సమయాల్లో మహిళలు మృతి చెందుతున్నారు.సాధారణంగా మహిళల శరీరంలో 12 శాతం నుంచి 15.5 శాతం హిమోగ్లోబిన్‌ ఉండాలి.. కానీ చాలా మంది మహిళల్లో ఆ స్థాయిలో ఉండడం లేదు. ఒక్కొక్కరికి 6 శాతానికి 5 శాతానికి హిమోగ్లోబిన్ స్థాయి పడిపోయిన మహిళలు ఉన్నారు. శరీరంలో తగిన స్థాయిలో ఐరన్ లేకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. చిన్న చిన్న సంకేతాల ద్వారా శరీరంలో ఐరన్ లోపాన్ని గుర్తించవచ్చు. అలసట, తలనొప్పి, మైకం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, గుండే దడ, జుట్టు రాలడం లాంటి లక్షణాలు ఉంటాయి. కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ చేసుకోవడం వల్ల రక్తంలోని హిమో గ్లోబిన్ స్థానికి తెలుసుకోవచ్చు. ఒంట్లో ఐరన్ లోపాన్ని ఈ టెస్ట్ ద్వారా నిర్ధారించుకోవచ్చు.ఐరన్ హీమోగ్లోబిన్ తయారీ, ఎర్ర రక్తకణాలకు ప్రోటీన్ ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హీమోగ్లోబిన్ స్థాయి తగ్గినట్లయితే మానవ కండరాలకు, అవయవాలకు తగిన ఆక్సిజన్ అందదు. దీంతో అవి అంత ప్రభావవంతగా పనిచేయవు. ఈ సమస్యను అధిగమనించాలంటే తగినస్థాయిలో ఐరన్ ఉన్న ఫుడ్‌ను తీసుకోవాలి. నిత్యం తీసుకునే ఆహార పదార్ధాల్లో ఐరన్ శాతాన్ని పెంచే వాటిని తీసుకుంటూ ఉండాలి.ఐరన్ లోపం నిరోధించేందుకు భోజనం చేసిన తర్వాత టీ, కాఫీలను సేవించడం మానుకోవాలి. ఐరన్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను పుష్కలంగా తినాలి.విటమిన్-సీ సమృద్ధిగా దొరికే ఆహారాన్ని తీసుకోవాలి. బియ్యం, గోధుమలు, డబుల్ పోర్టీఫైడ్ సాల్ట్, బలవర్ధకమైన ఆహారాన్ని తినడం ద్వారా ఐరన్ డిఫెషియన్సీని అరికట్టవచ్చు.రక్తహీనత అనేది ఒక సైలెంట్ కిల్లర్. దేశంలోని మహిళల జనాభాలో సగం మంది దీనికి గురవుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2016 ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా రక్తహీనత బాధితులు గల దేశం భారత దేశం. మహిళల్లో 53 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భవతుల్లో 50 శాతం రక్తహీనతకు గురవుతున్నారు. పీరియడ్స్, ప్రసవాలు తదితర అవసరాల రీత్యా కాబట్టి సహజంగానే మహిళలకు ఎక్కువ రక్తం అవసరం అవుతుంది. మహిళలు శరీరంలో ఐరన్‌ ఉన్న ఆహారాన్ని తీసుకోవడంపై శ్రద్ధ పెట్టాలి.మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయో చూశారుగా. ఇలాంటి సమస్యల గురించి ఎవరికీ తెలియదు. దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com