ఆ ఆలయంలో రాజమౌళి ప్రత్యేక పూజలు

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 06:05 PM
 

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో హిమవద్ గోపాలస్వామి ఆలయం ఎంతో ప్రసిద్దమైంది. ఈ ప్రాచీన ఆలయాన్ని టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి సతీసమేతంగా దర్శించారు. ఈ ఆలయంలో రాజమౌళి, ఆయన అర్ధాంగి రమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది రాజమౌళి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశాయి. కాగా, దర్శకుడు రాజమౌళి గత కొన్నిరోజులుగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. మైసూర్, కొడుగు వంటి పర్యాటక ప్రదేశాలను ఆయన సందర్శించారు. అంతేకాదు, రాజమౌళి, రమ కర్ణాటకలోని ఫేమస్ బందిపూర్ అభయారణ్యంలోనూ పర్యటించగా, అక్కడ వీరిని పలువురు తమ కెమెరాల్లో బంధించారు.