సచివాలయ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 05:51 PM
 

సచివాలయ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని బాపట్ల తహసీల్దార్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం స్థానిక కార్యాలయంలో సిబ్బందితో ఆయనమాట్లాడారు.. ఆదివారం ఉదయం, సాయంత్రం బాపట్ల పట్టణ, మండల పరిధిలో 18 కేంద్రాలలో జరిగే సచివాలయ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల గురించి సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు జారి చేసినట్లు పేర్కొన్నారు.కొవిడ్- 19 సోకి తగ్గిన వారు పరీక్షలకు హాజరు అయితే అటువంటి వారిని ప్రత్యేక గదులలో ఉంచి పరీక్షలు నిర్వహించాలన్నారు.కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని ఆయన చెప్పారు.