కుడి చేత్తో ఇస్తూ..ఎడమ చేత్తో కొట్టేస్తున్నారు: లోకేశ్

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 05:47 PM
 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క రోడ్డు వేసింది లేదు. కనీసం గుంతలు కూడా పూడ్చలేదు..కాని రోడ్డు అభివృద్ధి పన్ను విధిస్తున్నారు. పీల్చే గాలిపై కూడా సీఎం జగన్ పన్ను వసూలు చేస్తారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ శనివారం ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. పొరుగు రాష్ట్రాల కంటే అధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై అదనంగా రూ.5 వసూలు చేస్తూ ప్రజలపై వేసిన భారం ఏడాదికి రూ.2500 కోట్లు అని.. కుడి చేత్తో రూపాయి ఇచ్చి ఎడమ చేత్తో రూ. 10లు కొట్టేయడమే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మహత్యం అని అన్నారు.