ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే అవకాశం.. నేడే లాస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 17, 2020, 03:25 PM

కరోనా కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరగడంతోపాటు ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక మిగిలింది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షే. ఈ పరీక్ష సెప్టెంబర్‌ 27వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే విద్యార్ధులకు పరీక్ష కేంద్రం (ఎగ్జామ్ సెంటర్‌)ను మార్చుకునే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. గతంలో ఏపీలో 16, తెలంగాణలో 7 ప్రాంతాల్లో పరీక్ష జరపాలని నిర్ణయించారు.అయితే తాజాగా ఏపీలో 30, తెలంగాణలో 15 ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే విద్యార్ధులు తమ పరీక్ష నగరాలను మార్చుకునే అవకాశాన్ని ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఇచ్చింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్‌సైట్‌ jeeadv.ac.in/ను సందర్శించాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa