పసి పిల్లలను చూసుకోవడం మహిళలకు అతిపెద్ద బాధ్యత. పిల్లలు నోరు విప్పి అడగలేరు గనుక.. వారికేం కావాలో .. ఏం చేయాలో తల్లులే ఆలోచించాలి. ఆ పసి పిల్లలకు మానసికంగా, శారీరకంగా ఏది మంచిదో అది చేయాలి. పిల్లల ఆకలి తీర్చాలి, ఆనందంగా ఉండేలా చేయాలి. అలా పిల్లలు హాయిగా ఉండేలా చేసేందుకు ఈ మధ్య ఎక్కువగా డైపర్స్ వాడకం పెరిగింది. డైపర్స్ ఎంతో కన్వీనెంట్‌గా ఉంటాయి.ఈ హడావిడి లైఫ్‌లో డైపర్స్ తల్లులకు కొంత ఊరటనిస్తున్నాయి. డైపర్స్‌ను ఉతకనక్కర్లేదు, లీకేజ్ ఉండదు. పిల్లలకు వారి తల్లిదండ్రులకీ కూడా డైపర్స్ ఇచ్చే హాయే వేరుగా ఉంటుంది. కానీ కొన్ని రకాల డైపర్స్ వల్ల కొన్ని సమస్యలుంటాయి. వాటిని గమనించకపోతే.. పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డైపర్స్‌ను యూజ్ చేసేటప్పుడు తల్లులు కచ్చితంగా వీటిని గమనించాలని సూచిస్తున్నారు.పసి పిల్లల స్కిన్ సాఫ్ట్‌గా జెంటిల్‌గా ఉంటుంది. కొన్ని డైపర్స్ సింథటిక్ ఫైబర్స్, రంగులు, హార్ష్ కెమికల్స్ కలిగి ఉంటాయి. ఇవి బేబీ సెన్సిటివ్ స్కిన్‌ని డామేజ్ చేసి ఎలర్జీని కలిగించవచ్చు. అందుకే, సాఫ్ట్‌గా, స్కిన్ ఫ్రెండ్లీ మెటీరియల్‌తో ఉండే డైపర్‌ని ఎంచుకోవాలి. అదేవిధంగా తడి డైపర్ చాలా సేపు బేబీ ఒంటి మీదే ఉండిపోతే బ్యాక్టీరియా పెరిగి రాష్‌కి దారి తీయవచ్చు. ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా డైపర్లను మారుస్తూ ఉండాలి.డైపర్స్‌లో సింథటిక్ మెటీరియల్స్, కెమికల్స్ ఉంటాయి. మరీ ఎక్కువసేపు వాటికి ఎక్స్‌పోజ్ అయితే పిల్లలకి అవి హాని చేస్తాయి. అయితే డైపర్స్‌ని అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటే ఈ ప్రాబ్లం రాదు. డైపర్స్‌లో వాడే మెటీరియల్ బేబీ యూరిన్‌ని పీల్చుకునేటట్లుగా ఉంటాయి. అదే మెటీరియల్ గాలి చొరబడకుండా చేస్తుంది. దాంతో బ్యాక్టీరియా పెరిగి ఇంఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే విధంగా ఎప్పుడూ డైపర్‌తోనే ఉండే పిల్లలకి టాయిలెట్ ట్రైనింగ్ కొంచెం కష్టమౌతుంది. ఎందుకంటే వాళ్లకి అన్ని పనులు డైపర్‌లోనే కానిచ్చేయడం అలవాటు అయిపోయి ఉంటుంది. దాంతో టాయిలెట్ ట్రైనింగ్ కి పిల్లలు చాలా పేచీ పెడతారు. డైపర్స్ వాడకంతో సంబంధం లేకుండా బేబీకి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తే ఈ సమస్య ఉండదు.అలాగే డైపర్స్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా తేమని పీల్చుకుని బేబీ స్కిన్‌కి తడి లేకుండా ఉండే డైపర్స్‌ను తీసుకోవడం మంచివి. ఇవి లీకేజ్, రాషెస్, ఇంఫెక్షన్స్ లేకుండా చూస్తాయి. డైపర్స్ సాఫ్ట్‌గా కెమికల్ ఫ్రీ మెటీరియల్‌తో చేసినవి అయితే బేబీ స్కిన్‌ని ఇరిటేట్ చేయకుండా ఉంటాయి. అలాగే బేబీకి కరెక్ట్‌గా ఒంటికి సరిగ్గా పట్టేట్టు ఉండాలి. మరీ లూజ్‌గా ఉంటే లీకేజ్ ఉంటుంది, మరీ టైట్‌గా ఉంటే రాషెస్ వస్తాయి.డైపర్స్‌కు బదులు క్లాత్ డైపర్స్ వాడుకోవచ్చు. ఇవి బేబీ స్కిన్‌కి కూడా మెత్తగా ఉంటాయి. బేబీ హెల్త్‌కి కూడా మంచిది. అయితే వీటిని వాడితే రెగ్యులర్‌గా మారుస్తూ, ఉతికి ఆరబెట్టాలి. కొన్ని సార్లు డిస్పోజబుల్ డైపర్స్ వాడడం తప్పనిసరి అవుతుంది. పూర్తిగా క్లాత్ డైపర్స్ మాత్రమే వాడడం ఈ రోజుల్లో కొంచెం కష్టం కావచ్చు. అలాంటప్పుడు ఈ ఎకోఫ్రెండ్లీ డిస్పోజబుల్ డైపర్స్ బాగా హెల్ప్ చేస్తాయి. ఇవి బేబీ స్కిన్‌కి కూడా సాఫ్ట్‌గా ఉంటాయి.డైపర్స్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి తల్లీ నిశ్చింతగా ఉండొచ్చు. అయితే చాలామందికి ఈ విషయాలు తెలియవు. కంఫర్ట్‌బుల్‌గా ఉన్నాయి కదా అని పిల్లలకు డైపర్స్ వాడేస్తారు. ప్రతి మహిళకు ఈ విషయం తెలిసేలా ఈ సమాచారాన్ని షేర్ చేయండి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa