ఈ రోజుల్లో నగరాలే కాకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటీరియర్ డిజైన్‌పై ప్రతి ఒక్కరికీ మక్కువ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం అపార్ట్‌మెంట్లలోనే ఉండే ఈ కల్చర్ మెల్లమెల్లగా అన్నిగృహాల్లోకి విస్తరిస్తోంది. దీంతో ప్రస్తుతం వీటికి మార్కెట్లో రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వారికి, విభిన్నంగా ఆలోచించే వారికి ఇదొక సువర్ణావశకాశంగా చెప్పొచ్చు. ఇక్కడ మీ తెలివితేటలు, క్రియేటివిటీతో మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఇక ఈరోజు స్వయం ఉపాధిలో ఇంటీరియర్ డిజైన్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఇప్పడు ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరమవుతుందో పూర్తి వివరాలను తెలుసుకుందాం.
భారత ప్రభుత్వం చొరవతో గృహ నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిద్వారా ఇంటీరియర్ డిజైన్ వ్యాపారానికి ఎన్నో అవకాశాలు కలుగుతున్నాయి. ఎవరైతే ఫ్యాషన్, గ్లామర్, పెయింటింగ్, క్రియేటివిటీ వంటి నైపుణ్యాలపై పట్టు కలిగి ఉంటారో వారి ఊహాత్మక ప్రపంచాన్ని ఇక్కడ ఆచరణలో పెట్టుకోవచ్చు. ఇంటీరియర్ డిజైన్ అనేది చాలా పెద్దది. ఎన్నోసబ్‌గ్రూపులను కలిగి ఉంటుంది. అందులో అడ్వాన్స్‌డ్ కార్పెంటరీ, ఫ్యాబ్రికేషన్, యాంటిక్ ఫర్నీచర్, ఫ్లోరింగ్, ఫర్నీషింగ్, బేస్‌మెంట్, రీమోడలింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్స్, సీలింగ్ తదితర విభాగాలు చాలా ఉంటాయి. అయితే ఈ రంగంలో మీరు ముందుగా మీ వినియోగదారులకు ఏమి కావాలో తెలుసుకోవాలి. ప్రారంభంలో కొత్త కస్టమర్లను గుర్తించడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాని ఒక్కసారి క్లిక్ అయితే మాత్రం తిరుగుండదు. ఇందుకోసం మీరు నైపుణ్యత గల సభ్యుల్ని నియమించుకోవాలి. అంతకంటే ముందు ఈ రంగంలో కొంత పెట్టుబడి (రెండు లేదా మూడు లక్షల రూపాయల వరకు) పెట్టాలి. ఒక చిన్నఆఫీసును ఏర్పాటు చేసుకుని, వాటి ఖర్చులను భరించేందుకు సిద్ధంగా ఉండాలి. ఇక కంప్యూటర్లు, ప్రింటర్, పెయింటింగ్ వంటి బ్రాండింగ్ వంటి వాటిలో పట్టున్నవారిని నియమించుకోవాలి.
మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్‌సైట్‌లో మీ కంపెనీ వివరాలను రిజిస్ట్రర్ చేయాలి. ఇందులో పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా లేదా భాగస్వామ్య సంస్థ లేదా సింగిల్ ఓనర్ కంపెనీ అనే వివరాలను పొందుపర్చాలి. అయితే సోలో ప్రొప్రేటర్‌షిప్‌గా నమోదు చేసుకోవడం మంచింది. రిజిస్ట్రేషన్ సమయంలో మీ కంపెనీ పేరు, లోగో వివరాలను తెలియజేయాలి. ఈ రెండు మీ కంపెనీకి బ్రాండ్‌ను తీసుకొస్తాయి. కంపెనీ పేరు రిజిస్ట్రర్ చేసుకున్న తర్వాత మీ స్థానిక మున్సిపాలిటీలో ట్రేడ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవాలి. అది కూడా తీసుకున్నాక మీ పాన్ నెంబర్‌ను జతచేసి ఒక కరెంట్ అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. జిఎస్‌టి కూడా తీసుకోవాలి. అయితే ఈ జిఎస్‌టి మీ కంపెనీ నుండి లావాదేవీలు ప్రారంభమయ్యాక కూడా తీసుకోవచ్చు. వీటి కోసం మీరు శ్రమ పడకుండా ఎవరైనా కన్సల్టెన్సీ సహాయం తీసుకోవడం మంచిది.
ముందుగా మీ దగ్గరికొచ్చే కస్టమర్లను మీరు ఆకర్షించాల్సి ఉంటుంది. చాలా మంది కస్టమర్లు వారికి కావాల్సిన డిజైన్ కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తారు. కాబట్టి మీరు మీ కంపెనీ పేరు మీద ఒక వెబ్‌సైట్‌ను ముందే ఏర్పాటు చేసుకోవడం మంచింది. అందులో మీ కంపెనీ వివరాలను వివరించి, మీరు ఇంతవరకు చేసిన డిజైన్లను, ఆకట్టుకునే ఫొటోలను, వీడియోలను ఆ వెబ్‌సైట్‌లో ఉంచాలి. వాటిని చూసిన కస్టమర్లు మిమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారు. మీ వ్యాపారం వృద్ధి కోసం ప్రారంభంలో మీరు కస్టమర్ల నుండి తక్కువ ఫీజు తీసుకోవడం మంచిది. మీ పనిలో మీరు నాణ్యతను పాటించి కస్టమర్‌ను సంతృప్తి పరిస్తే మీ కంపెనీ త్వరగా అభివృద్ధి చెందుతుంది.
మీరు చేసిన పనులను సోషల్ మీడియా ద్వారా ప్రమోటింగ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటిలో ఆకర్షించే ఫొటోలను అప్‌లోడ్ చేయొచ్చు. అలాగే బ్లాగుల్లో కూడా మీ కంపెనీని ప్రమోట్ చేసుకోవచ్చు. దీని వలన మీ కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ అన్నది క్రియేట్ అవుతుంది. ఇవే కాకుండా ప్రింటి మీడియా, టివిల ద్వారా మీ కంపెనీని ప్రమోట్ చేసుకోవచ్చు. ట్రేడ్ ఈవెంట్స్‌లోనూ భాగస్వాములై మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa