ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్య కార్యకర్తలకు రూ. 50 లక్షల బీమా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 13, 2020, 05:34 PM

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు గోవా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య కార్యకర్తలకు గోవా రూ. 50 లక్షల బీమా సౌకర్యాన్ని విస్తరించింది. కోవిడ్-19కు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ముందంజలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలందరికీ రూ. 50 లక్షల బీమా రక్షణను విస్తరించినట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆదివారం తెలిపారు. ప్రధాన ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన కింద ఈ బీమా వర్తిస్తుందని తెలిపారు.గోవాలోని ఆరోగ్య కార్యకర్తలందరికీ రూ. 50 లక్షల బీమా కవరేజీని విస్తరించిందని సావంత్ ట్వీట్ చేశారు. కోవిడ్-19 వల్ల ప్రాణనష్టం జరిగినా లేక విధుల కారణంగా ప్రమాదవశాత్తు ప్రాణనష్టం జరిగినా ఈ పథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా ఈ పథకానికి నిధులు సమకూరుతున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa