ఏపీలో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో కన్నతల్లిని కర్కశంగా నరికి చంపాడో కసాయి కొడుకు. నిద్రపోతున్న తల్లిపై అమాంతం కత్తితో విరుచుకుపడ్డాడు. కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ అత్యంత అమానవీయ ఘటన రొంపిచర్ల మండలం అన్నవరంలో జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు..అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న తల్లిపై కొడుకు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆస్తి వివాదాల కారణంగానే ఈ దారుణం జరిగినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa