భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) బెంగళూరు, హైదరాబాద్, చాందీపూర్, వైజాగ్, మచిలీపట్నంతో సహా దేశంలో అనేక యూనిట్లలో ఖాళీగా ఉన్న 145 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ విభాగాల్లో ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 145
ప్రాజెక్ట్ ఇంజినీర్ - 54
ప్రాజెక్ట్ ఇంజనీర్ (1) - 37 (Civil/ EEE/ Mechanical)
ట్రెయినీ ఇంజనీర్ - 54
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి.
వయసు: 01.09.2020 నాటికి ట్రెయినీ ఇంజనీర్ పోస్టులకు 25 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ట్రెయినీ ఇంజనీర్ పోస్టులకు రూ.200, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ.500.
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 7, 2020
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 27, 2020
పూర్తి వివరాలకు అభ్యర్థులు bel-india.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa