గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాలని.. ఆలూరు తహశీల్దార్ హుషేన్ సాబ్ సూచించారు. ఈ మేరకు సోమవారం ఆలూరు తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విఆర్ఓల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు గ్రామాలను ఎంపిక చేసుకొని రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ నెల 15 నుంచి గ్రామ సభలు నిర్వహించాలన్నారు. ఆలూరు మండలంలో మొదటగా కాత్రికి, మూసనహళ్లి, కురువల్లి గ్రామల్లో ఈ సమావేశాలు నిర్వహించి రైతులకు సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్, ఆర్ఐ గుండాల నాయక్, సర్వేయర్ ఈశ్వర్ ప్రసాద్ మండల విఆర్ఓ పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa