కర్నూలు జిల్లా పెద్దకడబుర్ మండల పరిధిలోని చిన్నతుంభళం గ్రామంలో దళితులకు త్రాగునీరు ఇవ్వకుండా వివక్ష చూపడం దారుణమని.. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి. రామన్న విమర్శించారు. ఈ మేరకు సోమవారం చిన్నతుంభళం గ్రామంలో దళిత వాడలో ఉండే 200 దళిత కుటుంబాలకు త్రాగునీరు అందించాలని కోరుతూ డప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయం ముందు దాదాపు 5 గంటలు పైగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి డివైఎఫ్ఐ మండల కార్యదర్శి బి. సుధాకర్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. చిన్నతుంభళం గ్రామంలో నివసిస్తున్న దాదాపు 200 దళిత కుటుంబాలకు త్రాగునీరు ఇవ్వకుండా వివక్ష చూపడం సిగ్గు చేటు అన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa