వ్యవసాయంలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. అలహాబాద్‌లో మాత్రం కొంతమంది మహిళలు వ్యవసాయం చేసి ఏడాదికి రెండున్నర నుంచి మూడు లక్షల
రూపాయలు సంపాదిస్తున్నారు.మైసూర్‌లో తమ్మయ్య అనే రైతు వ్యవసాయంతో ఏడాదికి పది లక్షలు సంపాదిస్తున్నాడు
300 రకాల మొక్కలు వేయడంతో లక్షల్లో ఆదాయం వస్తుంది. ఒకప్పుడు నష్టాలు చవిచూసినా
తమ్మయ్య ఇప్పుడు లక్షలు వెనకేసుకుంటున్నాడు.మల్టీ లేయర్ ఆర్గానిక్ ఫార్మింగ్‌తో ఇది సాధ్యమైంది. ఈ విధానంలో ఏడాదంతా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మల్టీ లేయర్ ఫార్మింగ్‌లో రైతులు కచ్చితమైన ఆదాయాన్ని సంపాదించుకునే వీలు ఉంది. ఈ పద్ధతిని ఫాలో అయితే రైతులు అప్పులు పాలయ్యే అవకాశమే ఉండదు. చిన్న, సన్నకారు రైతులకు ఈ విధానం చాలా అనుకూలంగా ఉంటుంది.ఒకే మైదానంలో ఒకే సమయంలో వేర్వేరు లేయర్స్‌లో వేర్వేరు మొక్కలను పెంచే పద్ధతిని మల్టీ లేయర్ ఫార్మింగ్ అంటారు. కొద్ది స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని.. ఈ వ్యవసాయం చేయోచ్చు. అందుబాటులో ఉండే సూర్యరశ్మీ, భూమి, నీళ్లు ఉపయోగించుకుని ఎక్కువ దిగుబడి సాధించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
ఈ వ్యవసాయ పద్ధతిలో, ఒకే పొలంలో ఒక నిర్దిష్ట సమయంలో నాలుగు లేదా ఐదు వేర్వేరు పంటలను పండిస్తారు. వివిధ కూరగాయలు, పండ్ల పంటలను కలిపే పండిస్తారు. ఆ మొక్కలకుసంబంధించిన విత్తనాలను వాటి రూట్ జోన్ ఆధారంగా లోతైన, మధ్య, ఎగువ పైభాగంలో నేలలలో విత్తుతారు. సేంద్రీయ ఎరువు, మట్టితో కూడిన చిన్న గుంటల్లో నాటుతారు. వివిధరకాలుగా వచ్చే పాదులను ట్రెల్సీన్‌ను ఏర్పాటు చేసి.. దానికి పాకేలా చేస్తారు.
ఈ మల్టీ లేయర్ ఫార్మింగ్ విధానం నీరు, ఎరువు, భూమిని పూర్తిగా ఉపయోగించుకునే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఉద్యాన పంటలు, తోటల పంటలలో స్థిరమైన ఉత్పాదకతను సాధించడానికి ఇది ఒక ఆధునిక విధానం. తోటల పంటలైన కొబ్బరి, అరేకా గింజ, కాఫీ, జీడిపప్పు బహుళ పొరల పెంపకం నుంచి అధిక ప్రయోజనాలను పొందుతాయి.ఈ వ్యవసాయ పద్ధతి పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. ఈ వ్యవసాయ విధానం పంటలపై వాతావరణంలోని ప్రభావాలను తగ్గిస్తుంది. భూమి సాంద్రతను పెంచుతుంది.
భూమిలో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పద్ధతి అధిక తీవ్రత కలిగిన వర్షపాతం, నేల కోత, కొండచరియల ప్రభావాలను తగ్గిస్తుంది. వివిధ రకాల పంటలను
పండించడం వల్ల జీవ వైవిధ్యం పెరుగుతుంది, ఈ జీవ వైవిధ్యంతో తెగులు, కలుపు మొక్కలు, వ్యాధులను నియంత్రణకు సహాయపడుతుందిమల్టీ లేయర్ ఫార్మింగ్‌లో అనేక పంటలను ఏక కాలంలో పండించడం ద్వారా ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. ఒక్కో పంట ఒక్కో సమయంలో చేతి రావడంతో ఏడాది పొడవునా ఏదోపంట దిగుబడి నుంచి రాబడి వస్తోంది. ఈ పద్ధతిలో సాగు వ్యయం చాలా తగ్గుతుంది. పైగా ఉన్న కొంచెం భూమిలోనే పంటలు పండించి.. ఆహార కొరత లేకుండా చేసుకోవచ్చు. అంటేకచ్చితమైన ఆహార భద్రత ఉంటుంది. మన భూమిలోనే వివిధ రకాల పంటలు వేసుకోవడంతో కిలో మీటర్లు దూరంలో ఉన్న మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.ఉన్న వనరులనే ఎలా వాడుకోవాలో అవగాహన పెంచుకుంటే.. మల్టీ లేయర్ ఫార్మింగ్ విధానంలో పెట్టుబడి వ్యయం తక్కువవుతుంది. దీంతో రాబడి పెరుగుతుంది. చిన్న రైతులకు చాలా
ప్రయోజనకరంగా ఉంటుంది.ఎలాంటి వ్యవసాయం రైతుల సమస్యలకు పరిష్కారం అవుతుంది..?
ఎలాంటి వ్యవసాయంతో ఆహార భద్రత ఏర్పడుతుందనే ప్రశ్నలకు మల్టీ లేయర్ ఫార్మింగ్ విధానం మంచి సమాధానం అవుతుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa