కరోనా లక్షణాలను కనుక్కోవడానికి మద్రాస్ ఐఐటీ, అంకుర సంస్థ మ్యూస్ వేరబుల్స్ ఓ మార్గం కనిపెట్టాయి. మనుషుల్లో కరోనా లక్షణాలను ముందుగానే పసికట్టే స్మార్ట్ బ్యాండ్‌లను సంయుక్తంగా అభివృద్ధి చేశాయా సంస్థలు. మన టెంపరేచరల్, ఆక్సిజన్ లెవల్స్‌ను బట్టి రెండు మూడు రోజుల ముందే కరోనా వైరస్‌ను ఈ స్మార్ట్ బ్యాండ్ గుర్తిస్తుందట. గుర్తించడమే కాదు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తుందట! మ్యూస్ క్యూ పేరిట తయారు చేసిన ఈ బ్యాండ్ ధర అయిదు వేల రూపాయలు మాత్రమేనట! స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ మ్యూస్ హెల్త్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మన బాడీలలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మ్యూస్ క్యూ ఇట్టే పసికడుతుంది. 30 సెకన్లలోనే యాప్ ద్వారా మనల్ని అలెర్ట్ చేస్తుందని మ్యూస్ వేరబుల్స్ సీఈవో చెబుతున్నారు. 29 దేశాలలో ఈ యాప్ అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa