కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. కుందూ నదిలో ప్రమాదవశాత్తు పడి బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామానికి చెందిన విద్యార్థి గల్లంతయ్యాడు. బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామానికి చెందిన ప్రసాద్ (23) తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎం.కామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ మేరకు శనివారం తన స్నేహితులతో కలిసి బైక్ మీద మహానందికి బయలుదేరారు. మద్దూరు గ్రామం వద్ద ప్రవహిస్తున్న కుందూ నందిని దాటారు. ఈ క్రమంలో కాళ్ళు కడుక్కునేందుకు నీటిని తీసుకునేందుకు వెళ్లి అదుపు తప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆచూకీ ఇంకా లభించలేదు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa