నగర శివారులోని మిలటరీ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు మాచిరాజు సుధీంద్ర కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి ఉపాధ్యాయులు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సుధీంద్ర మాట్లాడుతూ... నేటి యువతకు సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఆదర్శం కావాలని ప్రతి ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ బాటలో పయనించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa