కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కోడుమూరు మండలంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ కట్టడికి వెలుగు ఏపీఎం పుష్పవతి పాఠశాల విద్యార్థుల కోసం 5 వేల మాస్కులను ఎంఈవో అనంతయ్యకు అందజేశారు. అనంతరం ఆయన మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల కోసం శనివారం ఈ మాస్కులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా యంఈవో అనంతయ్య మాట్లాడుతూ.. అందజేసిన ఈ మాస్కులను ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలలో ప్రారంభమైన వెంటనే తమ పాఠశాలలో చదువుతున్న బాలబాలికలకు పంపిణీ చేయాలన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa