మీరు ఇల్లు కట్టుకుని సుఖంగా జీవించాలి అనుకుంటున్నారా..? కొత్త ఇల్లు కట్టుకుని కుటుంబమంతా హాయిగా జీవించాలని అనుకుంటున్నారా లేక ఫ్లాట్ లాంటివి కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా...? అయితే మీ సొంతింటి కలల్ని సాకారం చేసేందుకు అనేక బ్యాంకులు లోన్ ల రూపంలో రుణాలు ఇస్తున్నాయి. తక్కువ వడ్డీతో బ్యాంకులో రుణం పొందే అవకాశం కల్పిస్తున్నాయి. చాలా మంది ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటారు. అయితే అంత డబ్బు పెట్టడం కష్టమే. కాబట్టి బ్యాంకులో లోన్ తీసుకుని కట్టుకోవడం కొంచెం సులువైన పని.అయితే దీనికి బ్యాంకు నుండి లోన్ తీసుకుని చేయడం బెటర్ కాబట్టి బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా హోమ్ లోన్స్ ని అందిస్తాయి. లోన్లు ఇచ్చే బ్యాంక్స్ అన్ని కూడా ఒకటే వడ్డీకి లోన్ ని అందించవు. ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ రేటు తో మీకు అందిస్తుంది. బ్యాంకులతో పాటు వడ్డీ రేట్లు కూడా మారిపోతాయి అలాగే చార్జీలు కూడా వేరేగా ఉంటాయి. అయితే కేవలం వడ్డీ రేటు మాత్రమే కాకుండా హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు రుణంపై ఎంత ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయనే విషయాన్ని కూడా గమనించాలి.చాలా బ్యాంకులు అధిక ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంటాయి. అందువల్ల ప్రాసెసింగ్ ఫీజు అంశంపై కూడా దృష్టి పెట్టాలి. హోమ్ లోన్స్‌పై ప్రస్తుతం వడ్డీ రేటు 7 శాతం కన్నా దిగువునే ఉంది. అయితే అన్ని బ్యాంకులు ఈ వడ్డీ రేటుకు రుణాలు అందించడం లేదు. కేవలం కొన్ని బ్యాంకులు మాత్రమే తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నాయి. అలా అతి తక్కువ వడ్డీ రేటుకే లోన్లు ఇస్తున్న 8 టాప్ బ్యాంకుల వివరాలను తెలుసుకుందాం.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నింటికన్నా తక్కువకు 6.7 శాతం వడ్డీకే రుణాలు ఆఫర్ చేస్తోంది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ వంటివి హోమ్ లోన్స్‌పై 6.85 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈ రెండు బ్యాంకుల తర్వాత కెనరా బ్యాంక్, పంజాబ్ నేషలన్ బ్యాంక్ వంటివి 6.9 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇక దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి హోమ్ లోన్స్‌పై 6.95 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునేవారు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa