ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహగిరిపై అంతర్గత విభేదాలు..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 03, 2020, 06:59 PM

సింహాద్రి నాథుని అలయంలో అంతర్గత విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. ఇటీవల కాలంలో సింహగిరి ఉద్యోగులు ఆరోపణలు ఎదుర్కుంటూ.. బదిలీ అవుతున్న నేపథ్యంలో కృష్ణ ఈవోగా పనిచేసిన భ్రమరాంబ తనను బదిలీ చేయాలని.. ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. ఇక్కడ నెలకొన్న రాజకీయ అంతర్గత విభేదాలతో విసుగు చెంది ఈ మేరకు ఆమె లేఖ రాసినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. మొత్తంమీద అప్పన్న దేవస్థానంలో విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. గతంలో ఇక్కడ ఈవోగా పనిచేసిన వెంకటేశ్వరరావు డిప్యూటీ కలెక్టర్ హోదాలో శైలజా తదితర అధికారులను ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇక్కడి పరిస్థితిని చక్కదిద్దారు అనే ఉద్దేశం దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ గా రాజమండ్రి లో విధులు నిర్వహిస్తున్న భ్రమరాంబ సింహాచలం దేవస్థానం ఈవో అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇక్కడ పరిస్థితులు కదా మామూలుగానే మారాయి. కొద్దిరోజులుగా ఆలయ చైర్మన్ బోర్డు సభ్యులు ఈఓ భ్రమరాంబపై అక్కసు వెల్లగక్కుతున్నారని సమాచారం. సింహగిరిపై ఈరోజుకథనం..ఈ నేపథ్యంలో తను ఇక్కడి నుంచి అదనపు బాధ్యతల నుంచి తప్పించాలని భ్రమరాంబ ఉన్నత అధికారులకు లేఖ రాశారు. ఈ లేఖను గుర్తించిన ప్రభుత్వం ఆమెను మళ్లీ రాజమండ్రి దేవాదాయ శాఖ సంయుక్త సంచాలకులు గా కొనసాగాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంతో సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందిన భ్రమరాంబా ఇలా లేఖ రాయడం వేరుగా విషయాలను పలువురు నిజంగా పరిశీలిస్తున్నారు. గతంలో భ్రమరాంబ కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవో గానూ సింహాచలం దేవస్థానం ప్రధానంగా శ్రీకాళహస్తి దేవస్థానం చేశారు. శ్రీకాళహస్తి ఈవో గా విధులు నిర్వహించిన నేపథ్యంలో ఆమె అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వ్యవహరించారు. అప్పట్లో అక్కడ కూడా పాలకవర్గానికి భ్రమరాంబ కు అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. నేడు కూడా అధిగమించిన భ్రమరాంబ ఉన్నతాధికారుల మెప్పు పొందారు. ముక్కు సూటి అధికారిగా వ్యవహరించే భ్రమరాంబ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారని అప్పన్న దేవస్థానం ఉద్యోగులు చెబుతున్నారు.కాగా సింహాచలం దేవస్థానం లో భూముల లీజుకు ఇవ్వాలని తాజాగా బోర్డు ఎజెండాలో పొందుపరిచింది. సుమారు 16 ఎకరాల విలువైన భూములను ఫంక్షన్ హాల్స్ పార్కింగ్ ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రైవేటు వ్యక్తులకు పదకొండేళ్ల పాటు లీజుకు ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే అది కూడా భవిష్యత్తులో ఇబ్బందులు దారితీస్తుందని.. భ్రమరాంబ వెల్లడించారు. వీటితో పాటు తాజాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివాదం బోర్డు తాజా అజెండాలోని అంశాలను ముందుగానే గుర్తించి భ్రమరాంబా నిర్ణయాలు అతి సహేతుకం కాదని రిప్లై వచ్చినట్లు సమాచారం. దీంతో విసుగు చెందిన ఆమె తనను బదిలీ చేయాలంటూ కోరినట్లు సమాచారం. ఇకపై ఆమె దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్ గా రాజమండ్రిలో విధులు నిర్వహించనున్నారు. కాగా తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యధిక ఆదాయం కలిగి ఉన్న సింహాచలం దేవస్థానం ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. తాజాగా జూలై నెల జీతాలు చెల్లింపులో జాప్యం జరుగుతోంది. అన్నింటిని ముందుగానే బేరీజు వేసుకుని తనను తప్పించడానికి ఆలయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం అన్నవరం యోగ విధులు నిర్వహిస్తున్న త్రినాధరావు సింహాచలం అదనపు బాధ్యతలను దేవాదాయశాఖ కమిషనర్ అప్పగించారు ఈ నేపథ్యంలో నేడు రేపు అయినా అధికారికంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కాగా మరోపక్క ఈ విభేదాలతో తలనొప్పిగా మారడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. విజయవాడ దేవస్థానానికి ఐఏఎస్ అధికారులు ఈవోగా నిర్మించినట్లు సింహాచలం దేవస్థానం కూడా ఓ ఐఏఎస్ అధికారిని నియమించాలని ఆలోచన ఉన్నట్లు తెలుస్తోందిసింహాచలం దేవస్థానంలో భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించిన ఇప్పటికీ పలు అంశాలపై ఇక్కడ పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొద్దిరోజులుగా చైర్మన్ సంచయిత గజపతి బోర్డు సభ్యులు ఈవో మధ్య సఖ్యత కొరవడిందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో చైర్మన్ తీసుకున్న పలు నిర్ణయాలు భ్రమణ ముందుగానే గుర్తించి.. వాటిని విశ్లేషించారు. చైర్మన్ కు సంబంధించి ఒక వ్యక్తి సింహగిరిపై గత కొంత కాలంగా అనధికారికంగా చేయడంతో పాటు.. ఇతర సదుపాయాలు పొందుతున్నారని వాదనలు ఉన్నాయి. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా అనే సదరు వ్యక్తి కీలకపా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారం భ్రమరాంబకు నచ్చలేదు. ఈ విషయంపై చైర్మన్లకు సంజాయిషీ కోర్టు బ్రమరాంబ నోటీసులు జారీ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక చైర్మన్ కు ఇటీవల బోర్డు తీర్మానం చేసింది ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న సదరు వ్యక్తి ప్రతినెల 50 వేల రూపాయలు జీతం భోజనం వసతి రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతూ.. బోర్డు సమావేశంలో నేను ప్రతిపాదించారు. వాస్తవంగా సింహాచలం దేవస్థానంలో ఇప్పుడు వరకు ఈ చైర్మన్ కు ఓఎస్డి నియమించలేదు. వ్యవస్థాపక చైర్మన్ పీవీజీ రాజు ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించిన పూసపాటి ఆనంద గజపతి రాజు తర్వాత బాధ్యతలు స్వీకరించిన అశోకగజపతి రాజు ఎప్పుడూ పోలీస్ డీలర్ నియామకం చేపట్టలేదు. ఈ అంశం తెర మీదకు రావడం మరింత వివాదాలకు తావిస్తోంది. వివాదాలు ఇక్కడితో నిలువరించ గలుగుతారా లేదా మరింత బహిర్గతమవుతాయన్నది వేచిచూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa