దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం మండల కేంద్రమైన వెల్దుర్తి లో నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి పాత బస్టాండ్ లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ వైయస్సార్ అందరివాడు అని కొనియాడారు. ప్రభుత్వ పథకాల అమలులో నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్ కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa