ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా..? మీరు పెద్దగా చదువుకోలేదా..? అయితే మీకు అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. పెద్దగా చదువుకోకపోయినా కూడా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తోనే బిజినెస్ చేసే అవకాశం ఉంది. అదే పోస్టాఫీస్ ఫ్రాంచైజీ. ప్రస్తుతం దేశంలో రెండు లక్షల వరకు పోస్టాఫీస్‌లు ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో పోస్టాఫీస్‌లు లేవు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఫ్రాంచైజీ ఇస్తోంది. అంటే నచ్చిన వారు పోస్టాఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు. దీని ద్వారా మంచి రాబడి పొందవచ్చు.దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేముందు మీకో ప్రశ్న.. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారు? కామెంట్ ద్వారా మాకు తెలపండి. మరిన్ని అప్ డేట్స్ కోసం సబ్ స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.ఎవరు అర్హులు..వయస్సు 18 ఏళ్లు దాటాలి. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఇవ్వరు. ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, వ్యక్తులు, స్వయం ఉపాధి, సంస్థలు, ఇతర సంస్థలు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ వ్యాపారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ తీసుకోవడానికి 8వ తరగతి చదివి ఉంటే సరిపోతుంది. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ తీసుకోవాలంటే కేవలం రూ.5000 సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే చాలు. దరఖాస్తుదారుడు ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు లక్ష నుంచి లక్షన్నర ఉంటే చాలు.
ఎలా అప్లై చేయాలి..పోస్టాఫీస్ ప్రాంఛైజీ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సంబంధిత అప్లికేషన్‌ను పోస్టాఫీసుల నుంచి తీసుకోవచ్చు. లేదా పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎంచుకున్న ఫ్రాంచైజ్ డిపార్టుమెంటుతో అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి.దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఇండియా పోస్ట్ అధికారులు పరిశీలిస్తారు. మీ దరఖాస్తు డివిజనల్ హెడ్‌కు వెళ్తుంది. మీరు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకున్న 14 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు.
ఏం చేయోచ్చు...పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్‌లో స్టాంపులు, స్టేషనరీ అమ్మొచ్చు. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, మనీ ఆర్డర్ లాంటి సేవలు అందించవచ్చు. రూ.100 కన్నా తక్కువగా మనీ ఆర్డర్ అనుమతించరు. పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ బుక్ చేయోచ్చు. ప్రీమియం వసూలు చేయొచ్చు. దీంతో పాటు బిల్లులు, పన్నులు వసూలు చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్‌కు సంబంధించిన సేవల్ని పౌరులకు అందించొచ్చు.
లాభాలు...ఫ్రాంచైజీ తీసుకున్న వారు స్టాంప్, స్టేషనరీ, స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్స్ వంటి వాటి ద్వారా రెగ్యులర్‌గా ఆదాయం పొందొచ్చు. రిజిస్టర్డ్ పోస్ట్‌కు రూ.3, స్పీడ్‌పోస్టుకు రూ.5 కమీషన్, రూ.100 నుంచి రూ.200 మనీ ఆర్డర్‌పై రూ.3.50, అంతకన్నా ఎక్కువ మనీ ఆర్డర్‌పై రూ.5 కమీషన్ వస్తుంది. నెలలో 1000 రిజిస్టర్ పోస్టులు, 1000 స్పీడ్ పోస్ట్‌లు బుక్ చేస్తే 20శాతం కమీషన్ అదనంగా లభిస్తుంది. www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫ్రాంచైజీ తీసుకునే వారికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ శిక్షణ కూడా ఇస్తుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa