కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని గూడూరు మండలం కె.నాగలాపురం గ్రామంలో బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్టేట్ కమిటీ సభ్యులు సంధ్య విక్రం కుమార్ స్థానిక వైసీపీ నాయకులతో కలిసి వైయస్ రాజశేఖర రెడ్డి 11 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వర్గీయులై 11 ఏళ్లు పూర్తయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల గుండెల్లో అలాగే నిలిచిపోవటానికి కారణం ఆయన చేసిన మంచి కార్యక్రమాలేనని అన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa