ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న 1333 గ్రామ/ వార్డ్ వాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై.. స్థానిక వ్యక్తి అయి ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
జిల్లాల వారీగా వివరాలు
నెల్లూరు - 273
చిత్తూరు - 374
శ్రీకాకుళం - 85
తూర్పు గోదావరి - 65
గుంటూరు - 239
ప్రకాశం - 225
మెుత్తం ఖాళీలు 133
మరిన్ని వివరాలు:
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత, స్థానిక వ్యక్తి అయి ఉండాలి.
వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: ప‌్రభుత్వ పథకాలపై అవగాహన, గత పని అనుభవం, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 28, 2020
వెబ్‌సైట్: gswsvolunteer.apcfss.in/
దరఖాస్తుకు చివరి తేది: నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల అభ్యర్థులు సెప్టెంబర్ 1 తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలి. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల అభ్యర్థులు సెప్టెంబర్ 04, గుంటూరు జిల్లాల అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీ, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa