కర్నూలు జిల్లా కర్నూలు నగరంలో మంగళవారం సీపీఎస్ రద్దు కోరుతూ ఐకాస పిలుపు మేరకు రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు తిమ్మన్న ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంఘం సభ్యులు మెడలో ఉరితాళ్లు బిగించుకోని వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికి నెరవేరలేదని విమర్శించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగుల బాధను అర్ధం చేసుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా సీపీఎస్ రద్దు చేయలేదన్నారు. రానున్న క్యాబినెట్ సమావేశంలో సీపీఎస్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని కమిటీలు పేరుతో కాలయాపన చేయవద్దని డిమాండ్ చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa