ప్రత్యేకంగా మహిళల కోసం చాలా యాప్స్ ఉన్నాయి. సెక్యూరిటీ కోసం, షాపింగ్ కోసం, ఫిట్‌నెస్ కోసం, ఆరోగ్యం కోసం, గర్భిణీలకు ఇలా ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. జాబ్స్ వెతుక్కోవడానికి, ఆన్ లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ బిల్డప్ చేసుకోవడానికి, ఆన్‌లైన్ కౌన్సిలింగ్ కోసం ఇవి యూజ్ అవుతాయి.
Sheroes only Women app (షీరోస్ ఓన్లీ వుమెన్ యాప్)
Sheroes.com ద్వారా యాక్సెస్ అయ్యే Sheroes only Women app మహిళలకు సంబంధించిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్. ఇందులో 20 లక్షల మంది వరకూ మహిళా యూజర్స్ ఉన్నారు. వివిధ రకాల భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్‌లో కెరీర్ గైడెన్స్ అందించడం జరుగుతుంది. డిప్రెషన్, రిలేషన్స్, హెల్త్‌కు సంబంధించిన కౌన్సిలింగ్‌లు ఇవ్వబడతాయి.
Maya Period Tracker & Health App For Women
ఈ యాప్ మహిళలకు చాలా ఉపయోగకరమైనది. ఇది పిరియడ్ ట్రాకర్ యాప్. పీరియడ్స్ ఎప్పుడొస్తాయో తెలియజేసేందుకు, పీరియడ్ లక్షణాలు, ఆ సమయంలో మూడ్స్‌లో వచ్చే మార్పులు గురించి తెలియజేస్తుంది. మహిళల నెలసరి ఆరోగ్యానికి సంబంధించి మంచి సమాచారాన్ని అందిస్తుంది.
Baby GOGO Mom app
కొత్తగా తల్లి అయిన మహిళలకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. పిల్లల పెరుగుదల, సంరక్షణ, ఆరోగ్యం, ఎలా చూసుకోవాలి వంటి అనే ప్రశ్నలకు ఇందులో సమాధానాలు దొరుకుతాయి. ప్రెగ్నేన్సీ రిలేటెడ్‌గా ఉండే అనేక అనుమానాలు ఈ యాప్ ద్వారా తీరిపోతాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Women Safety Apps in India (మహిళల భద్రతకు సంబంధించిన యాప్స్)
మన దేశంలో మహిళల భద్రతకు సంబంధించిన యాప్స్ చాలానే ఉన్నాయి. అందులో 112 మహిళల భద్రతా యాప్ ఒకటి. నిర్భయ ఘటన అనంతరం భారత ప్రభుత్వం ఈ యాప్‌ను రూపొందించింది. మహిళలు ఆపద సమయంలో ఈ యాప్‌లోని పవర్ బటన్‌ను మూడుసార్లు ప్రెస్ చేస్తే.. వెంటనే వారిని రక్షించేందుకు పోలీసులు వస్తారు.
Arogyasethu app
ఆరోగ్య సేతు యాప్‌ను ప్రభుత్వం డెవలప్ చేసింది. ఈ యాప్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో మంచి హెల్త్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మహిళల్లో నెలసరి సంబంధిత సమస్యలకు ఇందులో పరిష్కారాలుంటాయి.
Urban Companys Safe salon At Home Services App
బ్యూటీకి సంబంధించిన ఎటువంటి సర్వీసులైనా ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఈ కొవిడ్ సమయంలో ఈ యాప్ ఎంతో యూజ్ అవుతుంది. ఈ యాప్ ద్వారా బ్యూటీకి సంబంధించిన సర్వీసులు ఇంటివద్దనే పొందవచ్చు. బయటకు వెళ్లే బాధ లేకుండా ఇంటి వద్దకే వచ్చి సర్వీస్ చేస్తారు.
Indiagold app
మహిళలకు బంగారం అంటే అపరిమితమైన ఇష్టం ఉంటుంది. ఈ యాప్ ద్వారా బంగారం కొని సొంతం చేసుకోవచ్చు. ఈ Indiagold app EMI పద్ధతిలో బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. 22 క్యారెట్ Bis హాల్ మార్క్‌డ్ జ్యూయలరీ అందుతుంది. కొనేముందు కేవలం 20 శాతం డబ్బును అందించి.. మిగతా డబ్బును మూడు లేదా ఆరు, లేదా 9 నెలల్లో కట్టొచ్చు. ఒక వేళ ఈ యాప్‌లో ఈరోజే బంగారాన్ని బుక్ చేసుకుంటే ఈరోజున్న ధరకే లాక్ చేసి పెడతారు. దీనివల్ల బంగారం రేటు పెరుగుతుందనే భయం కూడా అక్కర్లేదు.
సెక్యూరిటీ నుంచి బంగారం కొనే వరకూ మహిళల కోసం చాలా యాప్స్ ఉన్నాయి. జస్ట్ స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్స్ వేసుకుంటే చాలు.. చాలా కావాల్సిన పని అయిపోతుంది. ఈ విషయం మహిళలందరికీ తెలిసేలా షేర్ చేయండి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa