రియల్ మీ 7 సిరీస్ స్మార్ట్ ఫోన్లు సెప్టెంబర్ మూడో తేదీన లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్ లో రియల్ మీ 7, రియల్ మీ 7 ప్రో ఫోన్లు రానున్నాయి. రియల్ మీ 7 ప్రో స్పెసిఫికేషన్లు గతవారంలోనే లీకయ్యాయి. ఇప్పుడు రియల్ మీ 7 స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. ఇందులో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్, 30W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఐపీఎస్ డిస్ ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 120 హెర్ట్జ్ గానూ ఉండనుందని తెలుస్తోంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్682 సెన్సార్ ను అందించనున్నారు. దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగా పిక్సెల్ వైట్ పొర్ ట్రెయిట్ సెన్సార్ లు కూడా ఇందులో ఉండనున్నాయి. ఇక ముందువైపు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. 30W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ మందం 0.94 గ్రాములుగానూ, ఫోన్ బరువు 196.5 గ్రాములుగానూ ఉండనుంది.రియల్ మీ 7 ప్రోలో 6.4 అంగుళాల డిస్ ప్లేను అందించనున్నట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి రియల్ మీ 7లో 7 ప్రో కంటే పెద్ద డిస్ ప్లే అందించనున్నారు. రియల్ మీ 7లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, రియల్ మీ 7 ప్రోలో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే రియల్ మీ 7 ప్రోలో 65W ఫాస్ట్ చార్జింగ్ ఉండనుంది. రియల్ మీ 7 ప్రోలో స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్, రియల్ మీ 7లో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ ను అందించనున్నట్లు తెలుస్తోంది.చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అన్ని పనులు చకచకా అయిపోతాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa