కోసిగి మండలం సజ్జలగుడ్డం గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వెటర్నరీ డిపార్ట్మెంట్ సమక్షంలో గొర్రెలు, మేకల, పశువుల కాపరులకు మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డిపార్ట్మెంట్ మెంట్ నుండి వచ్చిన ఐమావతి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణంలో పశువులకు అనేక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి ఏమాత్రం అలసత్వం చేయకుండా గొర్రెలను, మేకలను, పశువులనుపర్యవేక్షిస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ మందులు సరైన టైంలో మోతాదులో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ సీఆర్పీ భీమేష్, గ్రామ వాలంటరీలు గొర్రెల, పశువుల కాపరులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa