ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెరిట్‌ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోండిలా...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 29, 2020, 06:40 PM

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు అందించనుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను నూతన దరఖాస్తు కోసం ఎంహెచ్ఆర్డీ తెలంగాణ రాష్ట్రానికి 2,570 స్కాలర్‌షిప్‌లను కేటాయించింది. ఈ స్కాలర్‌షిప్‌లకు అక్టోబరు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉపకారవేతనాలకు ప్రాథమికంగా ఎంపికైన 52,740 మంది ఇంటర్‌ విద్యార్థుల పేర్లను తెలంగాణ ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in/ లో ఉంచింది. ఈ సంబంధిత అభ్యర్థులంతా scholarships.gov.in/ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అంతేకాకుండా 2016-17 నుంచి 2019-2020 వరకు స్కాలర్‌షిప్‌ల రెన్యువల్‌కు చివరి తేదీ కూడా అక్టోబర్ 31గా స్పష్టం చేసింది. ఆసక్తి ఉన్న విద్యార్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa