కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ ను అంతం చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా వైరస్‌కి కొత్త మందుల తయారీ కోసం జరుపుతున్న పరిశోధనలో పిల్లికి కరోనా వైరస్ సోకితే దానికి ఆ మందు (టాబ్లెట్) ఇచ్చారు. అంతే ఆ టాబ్లెట్లతో పిల్లికి పూర్తిగా కరోనా పోయి నెగెటివ్ వచ్చేసింది. మరి ఆ మందుల్ని మనుషులకు ఇస్తే బాగా పనిచేసి కరోనా ఖతం అవుతుందేమో అని అనుకుంటున్నారు. ఈ వివరాల్ని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో రాశారు. ల్యాబ్‌లో పెరుగుతున్న కణాలపై ఈ మందును ప్రయోగించి చూశారు. ఆ కణాలపై కరోనా వైరస్ ఉంది. ఈ మందు కణాలపై బాగా పనిచేసి కరోనా వైరస్‌ని చంపేసింది."ఈ మందు మనుషులకు బాగా పనిచేసేలా ఉంది. అందువల్ల ఇది కరోనాకి కచ్చితమైన, ప్రభావవంతమైన మందు కాగలదని మేం అనుకుంటున్నాం." అని అల్బెర్టా యూనివర్శిటీ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ లెమియక్స్ అన్నారు. ఇంతకీ ఆ మందు పేరేంటో సైంటిస్టులు చెప్పలేదు. హైబీపీ నుంచి కాన్సర్, hiv వరకూ చాలా రకాల అనారోగ్యాలకు ఆ మందును ఇస్తారంటున్న డాక్టర్లు ఆ మందు బాడీలోని మాలిక్యూల్స్‌లోకి వెళ్లి వైరస్‌ల పని పడుతుందని చెబుతున్నారు. ఇప్పుడు దీన్ని మనుషుల్లో కరోనా వైరస్ పోగొట్టేందుకు వీలుగా మార్పులు చేస్తామంటున్నారు. వెంటనే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామంటున్నారు. మనుషుల్లో కరోనాని ఇది చంపగలిగితే ఇక కరోనా వైరస్‌కి చెక్ పెట్టినట్లే.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa