108 అంబులెన్స్ సేవల్లో భాగంగా మన జిల్లాకు 57 అంబులెన్స్ లు కేటాయించారు వీటిలో రెండు నియోనాటల్ అంబులెన్స్‌లు అదోని మరియు నంద్యాల కు కేటాయించడం జరిగింది. నవజాత శిశు మరణాలు తగ్గించాలనే ముఖ్య ఉద్దేశ్యం తో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం *నియోనాటల్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు* ప్రవేశపెట్టడం జరిగింది.గత రెండు నెలల కార్యకలాపాల సమయంలో, జిల్లాలో నియోనాటల్ అంబులెన్సుల వినియోగం చాలా తక్కువ అని గుర్తించబడింది.నియోనాటల్ అంబులెన్స్ వినియోగాన్ని మెరుగుపరచడానికి, ప్రభుత్వం వారు *ప్రసూతి కేంద్రము* మరియు *సమీప SNCU (Special Neonatal care Unit) మరియు సేవల కోసం అందుబాటులో ఉన్న నియోనాటల్ అంబులెన్స్‌ల గురించి సమాచారం*తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ రామసుందర రెడ్డి గారు జిల్లా జాయింట్ కలెక్టర్, శ్రీ రామగిడ్డయ్య గారు DM&HO, 108 సర్వీస్ జిల్లా ఎగ్జిక్యూటివ్స్ సంజీవ రెడ్డి జి, శివ కృష్ణ, మస్తాన్ వలి మరియు నియోనాటల్ అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa