భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నోయిడాలోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్) 40 ఇంజనీర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ మొత్తం పోస్టుల్లో ప‌్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, సివిల్, ఫైర్ అండ్ సేఫ్టీ విభాగాలున్నాయి.
మొత్తం ఖాళీలు: 40
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి.
వయసు: పోస్టులను బట్టి 30-45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 25, 2020.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Chief Manager (HR), National Fertilizers Limited, A-11, Sector-24, Noida, District Gautam Budh Nagar, Uttar Pradesh - 201301.
పూర్తి వివరాలకు www.nationalfertilizers.com/ వెబ్‌సైట్ చూడవచ్చు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa